వైసీపీ నేతలకు కండకావరం ఎక్కువైంది : చంద్రబాబు

cm-jagan

వైసీపీ నేతలకు కండకావరం ఎక్కువైందని.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసులు పెడితే తీసుకోవడంలేదని, దాడి చేసిన వాళ్ల ఫిర్యాదుతో తమ పార్టీ నేతల్ని అరెస్ట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో తమ పార్టీ వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలల్లో సీఎం జగన్‌ సాధించిందేమీ లేదని, దాడులు చేస్తూ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. జగన్‌ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. పిచ్చిగా ఆలోచిస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని చెప్పారు.

Recommended For You