ప్రకాశం జిల్లాలో దారుణం.. చిన్నారి సహా మహిళ దారుణ హత్య

murder.png

ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి శివారులో చిన్నారి సహా మహిళ దారుణ హత్యకు గురైంది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య చేసిన తర్వాత మృతదేహాలను తగలబట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి తలపై బండరాయితో మోది చంపినట్లుగా ఆనవాళ్లను గుర్తించారు. ఓ కత్తితో పాటు బీరు బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్యలు జరిగాయా.. అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించాయి.

Recommended For You