తెలుగు భాషను వైసీపీ ప్రభుత్వం చంపేస్తుంది : పవన్ కల్యాణ్

cm-jagan

వైసీపీ నేతల తీరులో రాష్ట్రంలో వచ్చి పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని విమర్శించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. పారిశ్రామిక వేత్తలను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. 70 శాతం ఉద్యోగాలు స్థానికులే అంటున్నారు.. అసలు పరిశ్రమలు వస్తాయా అని ప్రశ్నించారు. కడప ఉక్కు పరిశ్రమ గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగు భాషను చంపేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ భాష అవసరమైనా తెలుగు బోధన తప్పని సరి అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్‌ ఆ తెలుగునే లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది ఒక్క తెలుగు భాషకేనా.. మిగతా మాధ్యమాలకు వర్తిస్తుందో లేదో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Recommended For You