ఆగని అత్యాచారాలు.. ఆ ‘దిశ’గా మరెన్నో..

 

rap

దిశ ఘటనపై దేశం అట్టుడికిపోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నిరసనలు హోరెత్తిపోతున్నా.. మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీలో ఒకే రోజు ఘోరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ కామాంధుడు 55 ఏళ్ల మహిళలపై అత్యాచారానికి తెగబడి హత్య చేశాడు. మరో ఘటనలో భర్తే తన స్నేహితుడితో కలిసి భార్యను రేప్ చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్లో ఒకరు గతంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి జైలుకు వెళ్లి వెచ్చాడు.
ఏడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ దారుణం. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దిశ. ఇలా ప్రాంతాలు మారుతున్నాయి. బాధితురాళ్ల పేర్లు మారుతున్నాయి. కానీ, అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. మగ మదంతో జనం మీద పడిన పశువుల బరితెగింపు ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ప్రకృతిలో విషాదం నింపుతున్న తుఫాన్లకు పేర్లు పెట్టినట్టుగానే మహిళల జీవితంలో విషాదం నింపుతున్న దారుణాలకు కూడా పేర్లు వెతుక్కొవాల్సిన పరిస్థితి దాపురించింది.

దేశమంతా ఒక్కటై మరో దిశ ఘటన జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహంతో ఊగిపోతున్న వేళ ఏపీలో ఒకే రోజు రెండు ఘటనలు ఉలిక్కిపడేలా చేశాయి. మహిళల్లో అమ్మ, అక్క, చెల్లి కనిపించాలని రోజుకో చర్చ నడుస్తున్నా.. ఈ కామాంధుడి కళ్లపొర తొలగిపోలేదు. 55 ఏళ్ల మహిళలపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని జీ వేమవరంలో ఈ దారుణం జరిగింది.

ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు కేశనకుర్తి నాగబాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంక్వైరీలో భాగంగా అతన్ని ఘటనాస్థలానికి తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు నిందితుడుపై దాడి చేశారు. అటు.. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

సమాజంలో మహిళలకు నాన్న, అన్న, భర్త రూపంలో భద్రత ఉంటుందని భావిస్తారు. అనంతపురంలో జరిగిన ఘటన ఆ భరోసాపై కూడా అనుమానాలు రేకెత్తించేలా ఉంది. భర్తే తన స్నేహితుడితో కలిసి బార్యపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దిరి పట్టణం సోమేష్‌ నగర్‌లో ఈ నెల 29న ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో మల్లేష్‌ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి.. భార్య చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి అత్యాచారం చేసినట్టు పోలీసులకు బాధితురాలు కంప్లైట్ చేసింది.

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. గతంలో పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మల్లేష్‌ 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రేప్ చేసిన వెదవలను వెంటనే ఉరితీయాలని ఊరువాడ ఏకమై నినదిస్తోంది. అలాంటి కామపిశాచుల పట్ల ఏమాత్రం దయచూపించినా.. మరో మహిళ బలికావాల్సి వస్తోందని అంటున్నారు.

Recommended For You