అమెరికా అధ్యక్షపదవికి పోటీనుంచి తప్పుకున్న కమలా హ్యారీస్

kamala-harries

అమెరికా అధ్యక్షపదవికి పోటీచేస్తున్న భారత సంతతికిచెందిన కమలా హ్యారీస్ పోటీనుంచి తప్పుకున్నారు. ఎన్నికల ప్రచారానికి కావాల్సినంత నిధులు సమకూరని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన కాలిఫోర్నియా సెనెటర్ అయిన ఆమె అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆఫ్రికన్ -ఇండియా సంతతికిచెందిన కమలా హ్యారీస్ ను పార్టీలో ఫిమేల్ ఒబామాగా అభివర్ణిస్తారు. అధ్యక్ష పదవినుంచి కమలా తప్పుకోవడంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అయ్యో పాపం… మిమ్మల్నిమిస్సవుతున్నాం కమలా అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అందుకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. అంతగా బాధపడకండి.. మిమ్మల్ని విచారణలో కలుస్తామని ట్వీట్ చేశారు. ఇరువురి ట్విట్ లు అమెరికాలో వైరల్ అవుతున్నాయి.

Recommended For You