ఆరంభం మాత్రమే.. దీనిని మరింత ఉద్రిక్తం చేస్తాం: డీకే అరుణ

ఆరంభం మాత్రమే.. దీనిని మరింత ఉద్రిక్తం చేస్తాం: డీకే అరుణ

dk

తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు చేయాలంటూ బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ ఇందిరాపార్క్‌ దగ్గర చేపట్టిన దీక్ష ముగిసింది. ఆమెకు నిమ్మరసం ఇచ్చి దీక్ష స్వామి పరిపూర్ణానంద విరమింపజేశారు. రెండు రోజుల పాటు దీక్ష చేపట్టిన డీకే అరుణకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలిపారు.

దిశ ఘటనతోనైనా సీఎం కేసీఆర్‌ కళ్లు తెరవాలన్నారు డీకే అరుణ. తెలంగాణలో మద్యం ఏరులై పారుతోందని.. మద్యానికి అనేక కుటుంబాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలను చూసైనా మద్య నిషేధం వైపు ఎందుకు అడుగులు వేయరని ప్రశ్నించారు డీకే అరుణ.

గుడిని, బడిని, ప్రజలు నివసించే ఏ ప్రాంతాన్ని వదలకుండా మద్యం షాపులు అనుమతులు ఇస్తున్నారుని మండిపడ్డారు డీకే అరుణ. దీక్ష కేవలం ప్రారంభం మాత్రమే.. రానున్న రోజుల్లో జిల్లా స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇప్పటికే మద్యం విషయంలో పోరాటంపై కార్యాచరణ సిద్ధం చేసిన బీజేపీ.. రానున్న రోజుల్లో దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపం తీసుకురావాలని భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story