వయసొచ్చిన కూతురికి ముద్దులు.. మీరా నీతులు..

వయసొచ్చిన కూతురికి ముద్దులు.. మీరా నీతులు..

rangoli

దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో.. సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతారు.. చెప్పేవన్నీ నీతి వాఖ్యాలు.. మీరా మాట్లాడేది అని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మహేష్ భట్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. వీడియోలో మహేష్ మాట్లాడుతూ.. మీలో ప్రేమ లేకపోతే ఎన్ని దేవుళ్లకు మొక్కినా, సామాజిక సేవలు చేసినా, పేదలకు సాయం చేసినా, రాజకీయాల్లోకి వచ్చినా, పుస్తకాలు రాసినా.. ఇలా ఎన్ని చేసినా మీరు చచ్చిన పాముతో సమానం. ప్రేమ లేని చోట సమస్యలు ఉంటాయి అని అందులోని సారాంశం.

అయితే ఈ బిల్లుని రంగోలీ సపోర్ట్ చేస్తుందో ఏమో.. దాంతో మహేష్‌పై ఉన్న అక్కసంతా ఈ విధంగా తీర్చేసుకుంది. మహేష్ గారూ.. పుస్తకాలు చదివితే విషయ పరిజ్ఞానం పెరుగుతుందేమో కానీ పెద్దమనుషులు కాలేరు.. వయసొచ్చిన కూతురిని ఒళ్లో కూర్చోబెట్టుకుని లిప్ కిస్సింగ్ ఇస్తూ ఫోటో తీయించుకున్న మీరా నీతులు మాట్లేడేది. మనం చేసే పనులతోనే పెద్దరికం వస్తుంది. దేశం కోసం మీరేం చేశారు.. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంటూ మహేష్‌పై విరుచుకుపడింది. మిత్రులారా విదేశీయులు భారతదేశంలో అడుగుపెట్టడం నచ్చని వారే మన శత్రువులు. మనం భరతమాతను రక్షించుకుందాం అని యువతను ఉద్దేశించి మాట్లాడింది.

మహేష్ కూతురు అలియా భట్, రణ్‌వీర్ నటించిన గల్లీ బాయ్ ఆస్కార్‌కు వెళ్లినట్టే వెళ్లి ఆగిపోయింది. దాన్ని కూడా వదల్లేదు రంగోలి. హాలీవుడ్‌లో వచ్చిన 8 మైల్ అనే సినిమాను గల్లీ బాయ్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఉరి, మణికర్ణిక సినిమాల్లాగా గల్లీబాయ్ ఒరిజినల్ కంటెంట్‌తో తీసిన సినిమా కాదు అని.. ఇలా హాలీవుడ్ సినిమాను కాపీ కొడితే పిలిచి మరీ ఆస్కార్ ఇస్తారా అని మహేష్‌ని ఏకిపారేసింది రంగోలి. ఒకప్పుడు కంగన, మహేష్ క్లోజ్ ఫ్రెండ్స్.. కానీ తాను తీసే ఓ సినిమాలో నటించేందుకు కంగన ఒప్పుకోలేదని ఆమెపై మహేష్ పగ పెంచుకున్నారు. కంగన సినిమా ఆడుతున్న థియేటర్‌కు వెళ్లి ఆమెపై చెప్పు విసిరారు. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం. అలియా భట్ అంటే కూడా కంగనకు అసలు పడదు.

Read MoreRead Less
Next Story