గుడ్డు తినేసి పెంకు పడేస్తున్నారా..

egg

హెల్దీ ఫుడ్ గుడ్డు. రోజుకో గుడ్డు తింటే మీ ఆరోగ్యం గుడ్. మరి గుడ్డు పెంకో.. అంది కూడా గుడ్డే అంటున్నాయి తాజా అధ్యయనాలు. గుడ్డు పెంకులను చాలా మంది చెత్త బుట్టలో పడేసినా.. మొక్కలున్న ఇళ్లలో ఈ పెంకులను మొక్కల మొదళ్లలో వేస్తుంటారు వాటికి ఆరోగ్యమని. మరి అవి మనిషిక్కూడా ఆరోగ్యమే అంటున్నారు అధ్యయనకారులు. గుడ్డు పెంకులో ఎన్నో పోషక విలువలు ఉన్నట్లు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మిగతా పదార్ధాలతో పోలిస్తే క్యాల్షియం గుడ్డు పెంకులోనే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఒక గుడ్డు పెంకులో వెయ్యి నుంచి పదిహేను వందల మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుందని తెలిపారు. గుడ్డు పెంకులను పొడి చేసి నీటితో కలిపి తీసుకుంటే దంతాలు, ఎముకల గట్టిదనానికి ఉపయోగపడుతుంది. ఈ పొడిని నీటిలో వేసి రాత్రంతా బట్టలను అందులో నానబెట్టి ఉతికితే మొండి మరకలు పోతాయి. గారపట్టిన పళ్లు తెల్లగా మారాలంటే ఈ పొడితో బ్రష్ చేసుకోవాలి. మొక్కల ఎదుగుదలకు పెంకులను అలా వేయకుండా వాటిని పొడిలా చేసి వేస్తుంటే మొక్క బాగా ఎదుగుతుంది. వంటింట్లో నూనె పదార్ధాల మరకలు పోవాలంటే పెంకుల పొడిని వెనిగర్‌తో కలిపి పీచుతో రుద్దితే ఫలితం ఉంటుంది.

Recommended For You