ఈ నెల 27న విశాఖపట్నంలో ఏపీ కేబినెట్‌ భేటీ!

ఈ నెల 27న విశాఖపట్నంలో ఏపీ కేబినెట్‌ భేటీ!

ap-cabinate-meeting

ఈ నెల 27న ఏపీ కేబినెట్‌ భేటీ విశాఖపట్నంలోనే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. కేబినెట్ భేటీలో రాజధాని అంశం ప్రధాన అజెండా కానుంది. ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు కమిటీ సిఫార్సుల మేరకు విశాఖపట్నంలో సచివాలయం, సీఎం కార్యాలయం, శాసనసభ ఏర్పాటుకు ఇప్పటికే భవనాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళన మిన్నంటుతున్నాయి. ఇలాంటి సమయంలో అక్కడ కేబినెట్ సమావేశం నిర్వహించడం కంటే.. విశాఖలోనే భేటీ అవ్వడం బెటరని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజధానిలో వారం రోజులుగా రైతులు ఆందోళన నిర్వహించటంతో పాటు ముఖ్యమంత్రితో సహా, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేబినెట్ సమావేశాన్ని ప్రయోగాత్మకంగా విశాఖలో నిర్వహించడంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కేబినెట్‌ భేటీ తరువాత రాజధాని ప్రాంతంపై వైసీపీ ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వనుంది.

మూడు ప్రాంతాల్లో రాజధాని ఎలా అభివృద్ధి చేయాలనే విషయమై ఇప్పటికే నిపుణుల కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ మేరకు ప్రాంతాల వారీ సమతుల్యత పాటిస్తూ ప్రస్తుత రాజధాని తుళ్లూరులో చేపట్టే అభివృద్ధి అంశాలపై కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. జి.ఎన్‌. రావు కమిటీ నివేదికను 27న జరిగే కేబినెట్‌ భేటీలో పెడతామన్నారు మంత్రి బొత్స సత్యానారాయణ. చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని.. విశాఖలో సీఎం క్యాంప్‌ ఆఫీసు ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story