కొందరికి ఫోన్ ఎంత ఉపయోగమో.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో

కొందరికి ఫోన్ ఎంత ఉపయోగమో.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో

ఈ మాయదారి ఫోన్లు వచ్చిన దగ్గరనుంచి పనీ పాట ఏమీ లేదు.. పొద్దున్న లేస్తే ఫోన్ పట్టుకునే కూర్చుంటున్నారు అని పిల్లలని చూసి తల్లిదండ్రులు వాపోతుంటారు. సాధారణంగా ప్రతి ఇంట్లో రోజూ ఉండే తంతు ఇది. నిజమే.. మరి అవసరానికి వాడితే ఎంతో ఉపయోగం. అదే పనిగా వాడితే అనర్థం. అన్నీ తెలిసిన వారు కూడా విలువైన సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటారు.. గంటలు గంటలు ఫోన్లతో గడిపేస్తుంటారు.

ఫోన్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. సమాచారాన్ని వెంటనే చేరవేయవచ్చు. విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అదే విషయాన్ని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రస్తావిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశారు.. ఆయన మనసుకి హత్తుకున్న ఈ వీడియోని మరికొంత మంది కోసం షేర్ చేశారు. మాటలు రాని ఓ మూగ వ్యక్తి సైగల ద్వారా అవతలి వ్యక్తికి వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు. స్మార్ట్ ఫోన్‌‌తో ఎంత ప్రయోజనం ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది అని ట్వీట్ చేశారు.

మొబైల్ ఫోన్లు ప్రపంచాన్ని మింగేస్తుందని టెక్నాలజీని తరచూ విమర్శిస్తుంటారు. కానీ కొంతమందికి దాని విలువ ఏంటో తెలుసు.. ఎలా వాడాలో తెలుసు అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కి నెటిజన్లు ఫిదా అయ్యారు. కేవలం 33 సెకన్లు ఉన్న ఈ వీడియోను ఇప్పటికే 1.46 లక్షల మంది చూశారు. 3,300 మంది రీట్వీట్ చేశారు 19 వేల మంది లైక్ కొట్టారు. టెక్నాలజీ వినియోగంపైనే బాగుపడడం, చెడిపోవడం అనేవి ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు.

Read MoreRead Less
Next Story