ఘోర అగ్ని ప్రమాదం.. 35 మంది దుర్మరణం

fire-accident

ఢిల్లీలోని అనాజ్‌మండీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 56 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మరికొందరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. కతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చిక్సిత అందిస్తున్నారు.

అనాజ్‌మండిలో నడుస్తున్న ఓ ప్లాస్టిక్ బ్యాగుల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో కార్మికులు, చుట్టుపక్కల వాళ్లు గాఢ నిద్రలో ఉన్నారు. చుట్టుముట్టిన పొగకు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఏం జరుగుతోందో తెలుసుకునే సరికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మరికొందరు నిద్రలోనే కన్నుమూసినట్టు చెప్తున్నారు. మంటల కంటే.. పొగ కారణంగానే ఎక్కువ ప్రాణనష్టం సంభవించినట్టు అగ్ని మాపక దళం ఉన్నతాధికారులు చెప్తున్నారు.

అనాజ్‌మండిలో చెలరేగిన మంటల్ని 30 ఫైరింజన్లతో అదుపు చేశారు. అయితే.. అది ఇరుకు మార్గంలో ఉండడంతో చాలాసేపటి వరకు లోపలకు వెళ్లేందుకు వీల్లేకుండా పోయింది. అయినప్పటికీ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించారు. పొగ కమ్మేయడం వల్లే ఎక్కువ నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు.