అసోం ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్

పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో అసోంలో ముగ్గురు చనిపోగా .. నిన్నసాయంత్రం.. గౌహాటి మెడికల్ కాలేజీలో మరో నిరసనకారుడు ప్రాణాలు వదిలాడు. ఈ అలర్లలో దాదాపు 30 మంది వరకు గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గౌహటిలో.. అసోం గణపరిషత్ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు గౌహాటి, డిబ్రూగడ్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో కర్ఫూ సడలించారు. పెట్రోల్ కొరత వంటివి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయి. ఆందోళనలు, గొడవలు జరిగే అవకాశం ఉండటంతో.. ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధాన్ని రేపటి వరకు పొడిగించారు.
బెంగాల్‌లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాదియా, 24 పరగాణాల, హౌరా జిల్లాల్లో నిరసనలు జరుగుతున్నాయి. పలుచోట్ల రహదారులను బ్లాక్ చేస్తూ... స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు. ఆందోళనకారులు పలుచోట్ల విధ్వంసానికి దిగడంతో పలు రైళ్లను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో... అక్కడికి వెళ్లే తమ పౌరులకు అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. అక్కడికి ఎవరూ వెళ్లకూడదని.. ఒక వేళ వెళ్లాల్సి వచ్చినా.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com