ఏపీఎస్‌ఆర్టీసీలో ఛార్జీల పెంపు

apsrtc

ఏపీఎస్‌ ఆర్టీసీలో బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. సంస్థను నష్టాల ఊబి నుంచి బయటకు తెచ్చేందుకు ఛార్జీల పెంపు తప్పడం లేదని ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలోమీటరుకు 10 పైసలు, మిగతా సర్వీసుల్లో కిలోమీటరుకు 20 పైసల చొప్పున టికెట్‌ ధర పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఛార్జీల పెంపు ఎప్పటి నుంచి అమలవుతుందన్నది సంస్థ ఎండీ ప్రకటిస్తారని తెలిపారు. ఆర్టీసీ ఇప్పటికే 6 వేల 500 కోట్ల నష్టాల్లో ఉందని.. ఛార్జీలు పెంచకపోతే సంస్థ దివాలా తీసే పరిస్థితి వస్తుందని మంత్రి పేర్ని నాని చెప్పారు.