ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పిడుగు..

apsrtc

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఛార్జీల పిడుగు పడింది. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల బస్‌ ఛార్జీలు కిలోమీటర్‌కు 10 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. మిగతా అన్ని సర్వీసులకు కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే పెరిగిన ఛార్జీల ఎప్పట్నుంచి అమల్లోకి వస్తాయన్నది త్వరలో ప్రకటించనున్నారు.

RTC బస్సు ఛార్జీల పెంపునకు సీఎం జగన్‌ ఆమోదముద్ర వేసినట్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సంస్థను నష్టాల ఊబి నుంచి బయట పడేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పెరిగిన ఛార్జీలు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయో.. ఆర్టీసీ ఎండీ ప్రకటిస్తారని మంత్రి పేర్ని నాని తెలిపారు.