తహసీల్దార్‌ విజయారెడ్డి అటెండర్ చంద్రయ్య మృతి

chandrahi

అబ్దుల్లాపూర్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని మంటల నుంచి కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య మృతి చెందాడు. 28 రోజులుగా డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో బర్నింగ్ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన.. తుది శ్వాస విడిచారు. చంద్రయ్య స్వగ్రామం శంషాబాద్‌ మండలం రాళ్లగూడు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో పనిచేసిన ఆయన మూడేళ్ల క్రితం అబ్దుల్లాపూర్‌ మేట్ తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ అయ్యాడు.