పులితో నా పోరాటం వృధా.. ఓ లేడి పిల్ల వ్యధ..

పులితో నా పోరాటం వృధా.. ఓ లేడి పిల్ల వ్యధ..

tiger

అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలియదు.. వారు నా కోసం వెతుకుతున్నారేమో.. పులి కంట్లో పడ్డ నేను తప్పించుకునే మార్గం లేదు. ఎలాగూ చావు తప్పదు.. కొంచెమైనా నా బలం ఏంటో చూపిస్తాను. బలవంతుల మీద బలహీనుల బలం ఏపాటిది.. పులి కూడా నన్ను కాసేపు తనతో ఆడుకోనిచ్చింది.. ఆటలో ఓడిపోకూడదని ప్రయత్నించాను.. కానీ దాని చేతిలో బలికాక తప్పలేదు. పోన్లే.. పోరాటం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నానని పేరైనా మిగులుతుంది కదా..

సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌కు వెళ్లిన ఆండ్రూ ఫౌరీ అనే సఫారీ గైడ్ కెమెరా కంటికి ఈ అరుదైన దృశ్యం చిక్కింది. న్యాలా అనే ఓ లేడి పిల్ల చిరుత చేతికి చిక్కింది. దానికి అప్పుడే ఆకలి అయినట్లు లేదు.. లేడి పిల్ల తనను ఏం చేసినా ఊరుకుంది. చిన్నదానిపైనా నా ప్రతాపం అనుకుందో ఏమో లేడి పిల్ల ఎన్ని దెబ్బలు కొట్టినా కిక్కురు మనలేదు. దానికి ఆటగా ఉన్నట్లుంది.. ఆకలేసినప్పుడు చూద్దాంలే దాని సంగతి అని..

దాదాపు రెండు గంటల పాటు ఆ రెంటి మద్య సాగిన దృశ్యంలో లేడి పిల్ల అలసి పోయింది. చిరుత నోటికి చిక్కింది. పంటితో పట్టి గుహలోకి దూరింది చిరుత. సాధారణంగా గైడ్‌లు జంతువులు వేటాడే దృశ్యాలను రికార్డు చేయరట. అయితే ఈ దృశ్యం తాము ఎన్నడూ చూడని విధంగా ఉండడంతో రికార్డ్ చేసినట్లు ఫౌరీ చెప్పాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Read MoreRead Less
Next Story