కొత్త ఇల్లు కొనుగోలు చేసిన బరాక్ ఒబామా

కొత్త ఇల్లు కొనుగోలు చేసిన బరాక్ ఒబామా

obama

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కొత్త ఇల్లును కొనుగోలు చేశాడు... అయితే ఇందులో ప్రత్యేక ఏముంది అనుకుంటారేమో... ఆ ఇళ్లు అలాంటి ఇలాంటి ఇళ్లుకాదు... అందమైన దీవిలో సుందరమైన సువిశాలమైన భవనం.. మసాచుసెట్స్ రాష్ట్రంలోని మార్తాస్ వినియార్డ్ దీవిపై నిర్మించిన ఇంటిని తీసుకున్నారు. 29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో ఏడు పడుకగదులు, తొమ్మిది బాత్ రూములు, రెండు అతిథి రూములు,అధునాతన కిచెన్ తో పాటు, స్విమ్మింగ్ ఫూల్, ప్రైవేట్ బీచ్, బోట్ హౌజ్ ఎంతో అందంగా ఉంది. చుట్టు పచ్చనిచెట్లు..మధ్యలో ఈ భవనాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. వేసవి విడిదికోసం అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చే ఒబామా కుటుంబానికి ఇది బాగా నచ్చడంతో దీన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story