కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు సీఎం కేసీఆర్‌ ఘాటు లేఖ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు సీఎం కేసీఆర్‌ ఘాటు లేఖ

cm-kcr

కేంద్రపై నేరుగా విమర్శల విల్లు ఎక్కుపెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు సీఎం కేసీఆర్‌ ఘాటుగా లేఖ రాశారు. పన్నుల వాటా ప్రకారం నిధులు ఇవ్వాలని కోరారు. లేదంటే వాస్తవ పరిస్థితిని వెల్లడించాలన్నారు. ఆర్థిక మాంద్యంతో రాష్ట్రానికి 14 శాతం మేర జీఎస్టీ నిధులు రావడం లేదన్నారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కింద 1719 కోట్లు ఇవ్వాల్సి ఉందని, బకాయి ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల గురించి.. త్వరలో ప్రధాని మోదీని కలిసే యోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు చెప్పారు.

పన్నుల వాటా కింద ఈ ఏడాది 10,304 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. గత ఏడాది కంటే 6.2 శాతం అధికంగా ఇస్తామని బడ్జెట్‌లో చెప్పారని గుర్తు చేశారు. అధికం సంగతి పక్కన పెడితే 2.3 శాతం తగ్గించి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐజీఎస్టీ ద్వారా తెలంగాణకు రావాల్సిన 2812 కోట్లు ఇంకా ఇవ్వలేదన్నారు. ఇదే విషయం కాగ్‌ కూడా స్పష్టంగా చెప్పింది గుర్తు చేశారు. కేంద్రం వెంటనే స్పందించి 4,531 కోట్ల రూపాయలు ఇవ్వాలని లేఖలో కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story