జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచువర్షం.. జనజీవనం అస్తవ్యస్తం..

జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచువర్షం.. జనజీవనం అస్తవ్యస్తం..

snow-fall

జమ్ముకశ్మీర్‌లో మంచువర్షంతో ఇబ్బందులు తప్పడం లేదు. చాలా చోట్ల 5 అంగుళాల మేర పేరుకుపోయింది. దీంతో సాధరణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా కురుస్తున్న మంచు వల్ల.. జమ్ము కశ్మీర్‌, లద్ధాక్‌లోని కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జమ్ము- శ్రీనగర్ రహదారి బంద్ అయ్యింది. పొగమంచు, హిమపాతం కారణంగా చాలా ఫ్లైట్లు రద్దయ్యాయి. మరికొద్ది రోజులు ఈ స్థాయిలో హిమపాతం పడుతూనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వారం తర్వాత విమానాల రాకపోకలు పునరుద్దరించినా మంచు ప్రభావం ఇంకా కనిపిస్తోంది.

వైష్ణోదేవి కొలువైన త్రికూట పర్వత ప్రాంతాన్ని మంచు కప్పేసినా.. దర్శానికి భక్తులు వెళ్తూనే ఉన్నారు. ఇటు శ్రీనగర్‌లో మైనస్ 1 డిగ్రీ ఉష్ణోగ్రత ఉంటే.. లద్ధాక్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ కొన్ని చోట్ల మైనస్ 10 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. ఐతే.. జమ్ములో మాత్రం ఉష్ణోగ్రత 9 డిగ్రీలుగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story