రైతు భరోసా డబ్బుల కోసం అన్నదమ్ములు గొడవ

రైతు భరోసా డబ్బుల కోసం అన్నదమ్ములు గొడవ
X

money

విశాఖ జిల్లాలో రైతు భరోసా డబ్బుల కోసం అన్నదమ్ములు గొడవకు దిగారు. ఈ డబ్బులు కావాలంటూ .. ఏకంగా తమ్ముడి భార్య కొండమ్మను నాటు తుపాకితో కాల్చాడు సోదరుడు కృష్ణ. ఈ ఘటన హుకుంపేట మండలం రంగశీలలో జరిగింది. బుల్లెట్‌ రవ్వలు... కొండమ్మ ఎడమచేతి నుంచి చాతిలో దూసుకుపోయాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో... ముందుగా పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే.. అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో... ఆమెను కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొండమ్మ చావు బతుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

Tags

Next Story