కృష్ణా నదిలో దూకిన యువతిని ప్రాణాలతో కాపాడిన ASI

asi-save-girl--life

ఏమైందో… ఏ కష్టమొచ్చిందో తెలియదు.. కృష్ణ జిల్లా అవనిగడ్డలో పులిగడ్డ- పెనుముడి బ్రిడ్జిపై నుంచి ఓ యువతి నదిలో దూకేసింది. వాహనదారులు సమాచారం ఇవ్వడంతో అవనిగడ్డ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. నదిలో కొట్టుకుపోతున్న యువతిని.. ASI మాణిక్యాలరావు ప్రాణాలకు తెగించి కాపాడారు.

ఆత్మహత్యకు యత్నంచిన యువతికి ప్రస్తుతం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ అమ్మాయి డిగ్రీ చదువుతున్నట్టు తెలుస్తోంది. రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్న ASI మాణిక్యాలరావు చూపిన సాహసానికి అందరూ అభినందిస్తున్నారు. స్థానికులు, ఉన్నతాధికారులు మాణిక్యాలరావు సాహసాన్ని మెచ్చుకుంటున్నారు.