రేపు తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటన

pawankalyan

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రేపటి జనసేన అధినేత పవన్‌ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు జన సైనికులు. రేపు ఉదయం 10 గంటలకు బయలుదేరి వేమగిరి, కడియం, కడియం సావరరం మీదుగా మండపేట నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ వెలగతోడు, ఇప్పనపాడుల్లో రైతులతో చర్చించి.. మండపేటకు చేరుకోనున్నారు. తరువాత అమలాపురం పార్లమెంట్‌ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు..

రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు పవన్‌ జిల్లాలో పర్యాటిస్తున్నారని చెప్పారు స్థానిక నేతలు. జనసైనికులంతా భారీగా హాజరై పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా రైతులకు మద్దతు ధరపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకే పర్యటనకు వస్తున్నారని వెల్లడించారు.