శీతాకాలంలో మరింత బాధించే కీళ్లనొప్పులు.. కాస్త ఉపశమనం కోసం ఇలా..

శీతాకాలంలో మరింత బాధించే కీళ్లనొప్పులు.. కాస్త ఉపశమనం కోసం ఇలా..

joint-pain

వణికించే చలి.. రగ్గు కప్పుకుని వెచ్చగా ముడుచుకుని పడుకుంటే పొద్దునకల్లా కాళ్లు, చేతులు పట్టేసినట్లు ఉంటాయి. అందరికీ అలానే ఉన్నా.. ఇంట్లో పెద్దవారు ఉంటే వారు మరింత ఇబ్బంది పడుతుంటారు బాధించే కీళ్ల నొప్పులతో.. ఓ పక్క చలి.. మరోపక్క కాళ్ల నొప్పులు. మందు బిళ్లలు ఎన్ని వేసుకున్నా మన ప్రయత్నంగా ఉపశమనం కోసం రోజూ ఇలా చేస్తుంటే.. కీళ్ల నొప్పులు కాస్త తగ్గే అవకాశం ఉంది.

సూర్య కిరణాలు పడే ప్రాంతంలో నిదానంగా నడవడం చేస్తుండాలి. చిన్న చిన్న వ్యాయామాలు.. శరీరం మొత్తాన్ని కదిలించేలాగా చేయాలి. నువ్వుల నూనెను గోరు వెచ్చగా చేసి నొప్పులు ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. గోరు వెచ్చని నీటిని కాపడం పెడుతుండాలి.

వంటింట్లో వాడే పసుపు ఒంటికి చాలా మంచింది. పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణం కీళ్లలో నొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. పసుపులో గోరు వెచ్చని నీటిని కలిపి పేస్ట్‌లాగా తయారు చేసి మోకాళ్లపై పూయాలి. గంటా రెండు గంటలు ఉంచుకుని ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

శరీరానికి తగినంత కాల్షియం, ఖనిజాలు ఇతర పోషకాలు అందించే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కీళ్ల ధృఢత్వానికి, ఇతర సమస్యల నుంచి బయటపడడానికి పాలు, పెరుగు, ఆకు కూరలు, నువ్వులు, అంజీర, సోయ, బాదం పాలు వంటి పోషకాహారాలను తీసుకోవాలి.

Read MoreRead Less
Next Story