డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు మహిళపై కత్తితో దాడి

women

కర్నూల్‌ జిల్లా ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన మహిళపై రహమతుల్లా అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పద్మావతి అనే మహిళ తన భర్త చనిపోయిన తరువాత.. జీవనోపాది కోసం కూరగాయలు అమ్ముతూ జీవిస్తోంది. అదే కాలనీకి చెందిన రహమతుల్లాకు చెందిన కూరగాయల అంగడిలో పని చేస్తోంది. ఆ పరిచయంతో అతడికి కొన్ని నెలల కిందట ఒక లక్ష రూపయాలను అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆవేశానికి లోనైన రహమతుల్లా.. ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. గమనించిన స్థానికులు.. ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.