అభిమాన ఆటగాడి జెర్సీ.. వేలంలో పలికిన ధర చూస్తే..

jersy

అభిమాన ఆటగాడు వాడిన వస్తువులు ఏవైనా.. ఎంత పెట్టి కొనడానికైనా వెనుకాడరు ఆయన అభిమానులు. ఇటీవల ఇటలీలో జరిగిన వేలంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ ప్లేయర్ పీలె వాడిన జెర్సీ కూడా అంతే క్రేజ్‌తో అమ్ముడు పోయింది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్స్ ట్రోపీ గెలుచుకున్న పీలె జెర్సీని 30 వేల యూరోలు అంటే రూ.26 లక్షల ధర పలికింది. 92 అంతర్జాతీయ గేమ్‌లలో 77 గోల్స్‌తో ప్రదర్శన చేసిన పీలే.. తన కెరీర్లో ఆఖరి సారిగా బ్రెజిల్‌కు ఆడాడు. 1971వ సంవత్సరంలో రియో డి జెనీరోలోని మారాకనా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యుగోస్లేవియాతో ఆడినప్పుడు వేసుకున్న జెర్సీని వేలంలో ఉంచారు. అదే వేలంలో మరో జెర్సీ అంటే 25 వేల యూరోలకు ఇటాలియన్ సైక్లింగ్ స్టార్ ఫాస్తో కొప్పీ జెర్సీకి దక్కింది. ఈ వేలంలో ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా సీనియర్ మారడోనా 1971వ సంవత్సరం యూఈఎఫ్ఏ కప్ టోర్నమెంట్‌లో ఆడినప్పుడు జెర్సీ 9వేల 4వందల యూరోలకు అమ్ముడుపోయింది. అమెరికన్ బాస్కెట్ బాల్ గ్రేట్ మైకేల్ జోర్డాన్ బ్యాట్ 425 యూరోల ధర మాత్రమే పలికింది.