నేటినుంచి రెండు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్న రాష్ట్రపతి

నేటినుంచి రెండు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్న రాష్ట్రపతి

kovindh

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గౌరవార్థం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి గవర్నర్‌ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి తన కుటుంబసభ్యులతో హాజరయ్యారు...

ఈ విందులో సీఎం కేసీఆర్, హిమాచల్‌ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ చౌహాన్‌ , అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , పలువురు మంత్రులు, విపక్ష నేతలు ఉత్తమ్, ఎల్‌ రమణ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు పలువురు ప్రముఖులు హాజరైయ్యారు...

ఈ సందర్భంగా... రెడ్‌క్రాస్‌ తెలంగాణ యాప్‌ను రాష్ట్రపతి కోవింద్ ఆవిష్కరించారు. ఈ యాప్‌ను సెంటర్‌ఫర్ గుడ్‌ గవర్నెన్స్‌ రూపొందించింది..

ఇవాల్టి నుంచి 26 వ తేదీ వరకు రాష్ట్రపతి చెన్నై, పుదుచ్చేరి, తిరువనంతపురంలో పర్యటిస్తారు. 27న రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందు ఏర్పాటు చేశారు. 28 మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ వెళతారు రాష్ట్రపతి.

Tags

Read MoreRead Less
Next Story