గవర్నర్ తమిళిసై తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ

tamilisaiరాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలను అరికట్టాలంటూ గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిసిన హస్తం నేతలు .. విచ్చల విడిగా మద్యం అమ్మకాలు పెరిగిపోయాయని ఫిర్యాదు చేశారు. బెల్ట్ షాపుల రద్దుపై చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళపై అత్యాచారాలు, హత్యలు పెరగడానికి మద్యం కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు.