ఇద్దరు యువకుల మధ్య ప్రేమ వ్యవహారం.. చివరకు ఏమైందంటే..

Screenshot_1

సూర్యాపేట జిల్లాలో వింత సంఘటన కలకలం రేపింది. ఇద్దరు యువకుల మధ్య ప్రేమ వ్యవహారం లింగమార్పిడికి దారి తీసింది. సూర్యపేటకు చెందిన సందీప్‌ అనే యువకుడితో అదే ప్రాంతానికి చెందిన సాయికి ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మహిళగా మారితే తననను పెళ్లి చేసుకుంటానని సందీప్‌కు సాయి హామీ ఇచ్చాడు. వెంటనే ఏం ఆలోచించకుండా మహిళగా సందీప్‌ లింగమార్పిడి చేయించుకున్నాడు. అప్పటి వరకు సందీప్‌తో సన్నిహితంగా ఉన్న సాయి.. అతడు మహిళగా మారిన తరువాత పెళ్లికి నిరాకరించాడు.. అక్కడితో ఆగక మరొక మహిళతో వివాహానికి సిద్ధమయ్యాడు. అయితే సందీప్‌తో సాయి ప్రేమ వ్యవహారం బయటకు రావడంతో వీరి పెళ్లి పీటలమీదే ఆగిపోయింది.