అలకబూనిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు

ponnala-and-vh

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్‌, పొన్నాల లక్ష్మయ్య అలకబూనారు. గవర్నర్‌తో భేటీ అయ్యే నేతల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో రాజ్‌భవన్‌ నుంచి వెనుదిరిగారు. దీంతో కాంగ్రెస్ నాయకత్వంపై వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పార్టీలో అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్ చేస్తేనే ఢిల్లీ నుంచి వచ్చా.. కానీ జాబితాలో తమ పేరు లేదని మండిపడ్డారు. ఇది తమను అవమానపర్చడమేనంటూ ఫైర్‌ అయ్యారు వీహెచ్‌.