వైసీపీలో సెగలు పుట్టిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు

anam-ramanarayanareddy

వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీలో సెగలు పుట్టిస్తున్నాయి. మాఫియా కోరల్లో నెల్లూరు నగరం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరుని ఉద్దేశించి చేశారనే చర్చ మొదలైంది. నగరంలో ల్యాండ్ మాఫియా.. లిక్కర్ మాఫియా.. సాండ్ మాఫియా,, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు, ఒకటేంటి ఏ మాఫియా కావాలన్నా నెల్లూరులో ఉందంటూ ఆనం హాట్‌ కామెంట్లు చేశారు. ఈ మాఫియా ఆగడాలపై లక్షలాది ప్రజలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు.