తెలంగాణలో ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చాలాచోట్ల బుధవారం కూడా డబ్బుల పంపిణీ చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మేడ్చల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పలు పోలింగ్‌ బూత్‌ల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.

ఓ వైపు పోలింగ్‌ జరుగుతుంటే మరోవైపు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్‌ -టిఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. మరికొందరు తమ ఓట్లు గల్లంతయ్యాయని, తమ ఓట్లను వేరే వారు వేశారంటూ పోలింగ్ బూత్‌ల దగ్గర ఆందోళనకు దిగారు..

120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు గంటల వరకు రాష్ట్రం వ్యాప్తంగా 70 శాతానికిపైగా పోలింగ్‌ జరిగింది. ఆదిబట్ల, చౌటుప్పల్లో అత్యధికంగా 85 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇటు నిజాంపేట్‌లో అత్యల్పంగా 33.6 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story