ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు రెడీ అవుతోన్న ఇస్రో

ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు రెడీ అవుతోన్న ఇస్రో

isro

ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు ఇస్రో అన్ని విధాలా రెడీ అవుతోంది. తాజాగా, నలుగురు వ్యోమగాములకు కోసం ఆహార పదార్థాలు కూడా సిద్ధం చేసింది. మైసూరులోని డీఆర్‌డీవో సంస్థ ఆ ఫుడ్ ఐట‌మ్‌ల‌ను త‌యారు చేసింది. ఫుడ్ ఐట‌మ్స్ లిస్టులో ఎగ్ రోల్స్‌, వెజ్ రోల్స్‌, ఇడ్లీ, మూంగ్ దాల్ హ‌ల్వా, వెజ్ పులావ్ ఉన్నాయి. ఫుడ్ హీట‌ర్ల‌ను కూడా వ్యోమ‌గాముల‌కు అందుబాటులో ఉంచ‌ను న్నారు. అంత‌రిక్షంలో తేలియాడే వ్యోమ‌గాముల కోసం తాగడానికి ప్ర‌త్యేకంగా కంటైన‌ర్లు త‌యారు చేశారు. వాట‌ర్‌, జ్యూస్‌ల‌ను తీసు కువెళ్లడానికి స్పెష‌ల్ ప్యాకెట్ల‌ను త‌యారు చేశారు.

2022లో గ‌గ‌న్‌యాన్ ప్రయోగం జరగనుంది. ఈ మిషన్‌ కోసం నలుగురు వ్యోమ‌గాములు ఎంపిక‌య్యారు. ఆ న‌లుగురూ శిక్షణ కోసం ర‌ష్యాకు వెళ్లారు. ప్రాజెక్టులో భాగంగా బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌ ఏర్పాటు చేశారు. వ్యోమగాములు రోదసీలోకి వెళ్లడానికి అవసరమైన మాడ్యుల్‌ను ఆవిష్కరించారు. మానవసహిత యాత్రకు వెళ్లే వ్యోమగాములకు ఇక్కడ కూడా శిక్షణ ఇస్తారు.

Read MoreRead Less
Next Story