భోగి వేడుకల్లో విదేశీయుల సందడి

bhogi-celebration-in-wgl

వరంగల్‌ జిల్లాలో భోగి, సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. కాజీపేటలోని బాల వికాసలో వివిధ దేశాలకు చెందిన 18 మంది ప్రతినిధులు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి నృత్యాలు చేశారు. గంగిరెద్దు విన్యాసాలు తిలకించి పులకించిపోయారు. పంటలు ఇంటికి వచ్చిన వేళ సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఒక మంచి సంప్రదాయమని.. వేడుకల్లో పాల్గొనడం తమకు ఆనందంగా ఉందని విదేశీయులు మురిసిపోయారు.