అమరావతి ప్రాంత పోలీసులపై హైకోర్టు కన్నెర్ర

ap-high-court

దాదాపు నెల రోజులుగా అలుపెరగకుండా ఉద్యమిస్తున్న అమరావతి ప్రాంత ప్రజలకు హైకోర్టు తీర్పుతో పెద్ద ఊరట లభించినట్టయింది. రాజధాని ప్రజలపై పోలీసులు ప్రదర్శిస్తున్న జులుంపై సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం.. రైతులు చేస్తున్న శాంతియుత నిరసనలకు అనుమతించాలని స్పష్టం చేసింది. పోలీసుల దౌర్జన్యకాండను సుమోటోగా స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

దీంతో రాజధాని గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా భోగి పండుగ నిర్వహించుకుంటున్నారు. వేడుకలకు దూరంగా ఉన్నా.. సంప్రదాయపద్ధతిలో పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. అటు హైకోర్టు ఆదేశాలతో పోలీసుల దౌర్జన్యకాండ తగ్గుముఖం పట్టింది. దీంతో రాజధాని ప్రాంతం ప్రజలు భోగి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకుంటున్నారు.