పరిశ్రమలు తరలిపోతున్నాయి: సీపీఐ రామకృష్ణ

మూడు ప్రాంతాల్లో రాజధానులు పెడితే అభివృద్ది జరుగడం సాధ్యం కాదన్నారు సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ. విజయనగరం జిల్లా జనరల్ బాడీ సమావేశానికి హాజరైన ఆయన.. రాజధాని విషయంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక అనుబంధ పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని ఆయన విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అన్ని పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 17న కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు.

Recommended For You