వివాహ వేడుకలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు చేదు అనుభవం

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ఓ వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. దీంతో పెళ్లికి వచ్చిన జనం.. మంత్రితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో కాదనలేని ఆయన అందరితో సెల్ఫీలు దిగారు. సెల్ఫీ తతంగమంతా అయ్యాక తీరా చూసుకుంటే.. చేతికి ఉన్న బంగారు కడియం మాయమైంది.

ఈ కడియాన్ని శ్రీనివాస్‌ గౌడ్‌ సెంటిమెంట్‌గా భావిస్తారట. అందుకే అక్కడే ఉన్న పోలీసులు, గన్‌మెన్లపై మంత్రి ఫైర్‌ అయినట్లు సమాచారం. తన కడియాన్ని దొంగలించిందెవరో తెలుసుకుని దాన్ని తిరిగి అప్పగించాలని పోలీసుల్ని ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రి ఆగ్రహించడంతో పోలీసులు.. పెళ్లి వేడుకకు వచ్చినవారిని కడియం గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఎవరైనా కడియం తీసి ఉంటే.. తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారట. మొత్తం మీద పెళ్లివేడుకకు వెళ్లిన శ్రీనివాస్‌ గౌడ్‌కు అనుకోని చేదు అనుభవం ఎదురైంది.

Recommended For You