ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్రతో పాతబస్తీకి మెట్రో రాకుండా పోయింది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్రతో పాతబస్తీకి మెట్రో రాకుండా పోయింది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

జేబీఎస్‌ -ఎంజీబీఎస్ మెట్రో‌ ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే మంత్రి తలసాని ఫోన్‌ చేశారని.. ఆరోజు పార్లమెంట్‌లో విప్‌ ఉండటం వల్ల రాలేకపోయానన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పాత బస్తీలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఎంఐఎం కుట్రలో టీఆర్‌ఎస్‌ భాగస్వామ్యం అయి పాతబస్తీకీ మెట్రో రాకుండా చేస్తోందన్నారు. యాదాద్రి వరకు రెండో దశ MMTS నిర్మాణ పనులు సాగడం లేదని, దీనికి టీఆర్‌ఎస్‌ కారణమన్నారు. పాత బస్తీకి మెట్రో రైలు సౌకర్యం కల్పించాలన్న ఆయన.. హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

స్థానిక ఎంపీ, కేంద్రమంత్రికి ఆహ్వానం లేకుండా జేబీఎస్‌- ఎంజీబీఎస్ మెట్రో‌ను ప్రారంభించారన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌. కేసీఆర్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. పలక్‌నామా వరకు మెట్రో ఉన్నా.. ఎంజీబీఎస్‌ వరకే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. పాత బస్తీలో మెట్రోను ఎంఐఎం నేతలు అడ్డుకుంటున్నారన్నారు. పాతబస్తీలో వెంటనే మెట్రో రైలును విస్తరించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story