న్యూయార్క్‌ జడ్జిగా సరితా కోమటిరెడ్డి!

అగ్రరాజ్యంలో మరో ఇండో- అమెరికన్‌ మహిళకు అరుదైన అవకాశం లభించింది. భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డిని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జడ్జిగా అమెరికా ప్రభుత్వం నామినేట్‌ చేసింది..
ఈ విషయాన్నీ రెండు రోజుల కిందటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. సరిత డాక్టర్ తల్లిదండ్రులు ఇద్దరూ తెలంగాణకు చెందినవారు.. వారు కొన్ని సంవత్సరాల కిందట యుఎస్ లో స్థిరపడ్డారు. తండ్రి హనుమంత్ రెడ్డి మిస్సౌరీలో కార్డియాలజిస్ట్ ఇక ఆమె తల్లి గీతా రెడ్డి రుమటాలజిస్ట్. మరోవైపు జడ్జి పదవికి సరితను నియమించడం పట్ల అమెరికాలోని భారతీయ-అమెరికన్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యంగా తెలుగు సంఘం ఆమెను అభినందించింది. “మెరిట్ సరిగా గుర్తించబడింది,” అని న్యాయవాది డోనేపుడి నాగేశ్వరరావు అన్నారు.

Recommended For You