గన్నవరం జేఏసీ దీక్షలకు సంఘీభావం తెలిపిన టీడీపీ ఎమ్మెల్సీ

అమరావతి సాధన కోసం గన్నవరం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. బాపులపాడు మండలం కోడూరుపాడు పంచాయితీకి చెందిన.. శోభనాద్రిపురం, ఉమామహేశ్వరపురం గ్రామాల రైతులు ఇవాళ దీక్షలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గన్నవరం జేఏసీ దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అక్రమ నిర్బంధాలతో అమరావతి ఉద్యమాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు. అమరావతి ఉద్యమాన్ని అణగదొక్కాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

Recommended For You