మద్యం ప్రియుల మధ్య చిచ్చుపెడుతోన్న కరోనా మహమ్మారి

కరోనా మహమ్మారి జనాన్ని భయపెట్టడమే కాదు.. మద్యం ప్రియుల మధ్య చిచ్చుపెడుతోంది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఓ గ్రామంలో మద్యం అమ్మకూడదని కొందరు యువకులు మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. అదే గ్రామానికి చెందిన మరో వర్గం యువకులు మాత్రం తమకు మద్యం కావాలని గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రం కావడంతో గ్రామస్తులు జోక్యం చేసుకుని చెదరగొట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం కోతులాపురం గ్రామంలో జరిగిందీ ఘటన. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఓవైపు ఇంట్లో నుంచి బయటికి వెళ్లొద్దని చెబుతుంటే.. కొన్ని చోట్ల బెల్టు షాపుల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఇంత జరగుతున్నా ప్రజాప్రతినిధులు, పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

Tags

Next Story