పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో.. పేదల కోసం నిత్యావసరాల పంపిణీకి తెలంగాణ అధికారులు ఏర్పాట్లు చేశారు. రేషన్ కార్డు ఉన్న లబ్దిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం, కుటుంబ ఖర్చుల కోసం 1500 రూపాయల నగదు అందిస్తున్నారు. చైతన్యపురి డివిజన్‌లో రేషన్ షాపుల వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం బియ్యం మాత్రం అందిస్తున్నారు. త్వరలో నగదును గ్యాస్ సబ్సిడీ పడే అకౌంట్‌లో జమ చేస్తామని చెప్తున్నా.. దీనిపై సరైన అవగాహన లేక కొందరు డీలర్లను నిలదీస్తున్నారు. అన్ని చోట్ల నుంచి ప్రజలు గుంపులు గుంపులుగా రాకుండా చూసేందుకు అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చి సమన్వయం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది.

Tags

Read MoreRead Less
Next Story