సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ.. కరోనా చర్యలపై సూచనలు

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ.. కరోనా చర్యలపై సూచనలు

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో కరోనా పరీక్షల తీరును గురించి తెలియజెస్తూ సీఎం జగన్ కి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలను సత్వరం పెంచాలని సూచించారు. ఇప్పటివరకూ 329 పరీక్షలు మాత్రమే చేసిందని.. అది చాలా తక్కువ అని తెలిపారు. దక్షిణ కొరియా వారానికి సగటున 4 లక్షల చొప్పున పరీక్షలు చేస్తోందన్నారు. వ్యాధి నిర్ధారణ కిట్లను అధిక సంఖ్యలో కొనుగోలు చేసి.. పరీక్షలు జరిపించాలని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన 15 లక్షల మందిని గుర్తించి క్వారంటైన్‌ చేయడంలో లోపాలున్నట్లు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి చెప్పారని చంద్రబాబు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు జరిపించాలన్నారు. ప్రభుత్వ చర్యలకు టీడీపీ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని బాబు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story