బాలీవుడ్ బాద్‌షా భారీ సాయం.. నెల రోజుల పాటు 10 వేల మందికి..

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కరోనా బాధితులను ఆదుకునే నిమిత్తం ఏర్పాటు చేసిన పిఎం కేర్స్ సహాయ నిధికి తన విరాళాన్ని అందజేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్, మీర్ ఫౌండేషన్, విఎఫ్ఎక్స్ వంటి గ్రూప్ కంపెనీలను కలిగి ఉన్న షారుఖ్.. వైరస్ బారిన పడకుండా ఎలా ఎదుర్కోవాలో సూచించారు. తన ఇన్‌స్టాలో ఇందుకు సంబంధించిన ఒక వీడియోను పోస్ట్ చేశారు. భారతదేశం మరియు భారతీయులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. అందరూ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఒంటరిగా లేరు. ఒకరికొకరు అందరం సహాయపడదాం అని ఆయన అన్నారు. ఈ వైరస్ బారిన ఎవరూ పడకూడదని ప్రార్ధన చేయండి అని తెలిపారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 50, 000 వ్యక్తిగత రక్షణ సామాగ్రి కిట్లను, ముంబైలో నివసిస్తున్న 5500 కుటుంబాలకు రోజువారి ఆహార సామాగ్రిని అందజేశారు. ఇంకా కనీసం ఒక నెల రోజుల పాటు 10,000 మంది 3 లక్షల భోజన వస్తు సామాగ్రిని అందించారు.

 

Recommended For You