ఏపీలో మొదటి కరోనా మరణం

ఏపీని కరోనా కబళిస్తుంది. విజయవాడలో తొలి కరోనా మరణం సంభవించింది. 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. మార్చి 17న ఢిల్లీ నుంచి వచ్చిన తన కుమారుడి ద్వారా ఆయనకు కరోనా సోకింది. వెంటనే తండ్రి, కుమారుడితో కాంటాక్ట్ అయిన 29 మందిని క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటివరకు 161 కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు మొదటి మరణం సంభవించటంతో రాష్ట్రంలో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Recommended For You