నా డ్రెస్ చూసి నాన్న..

షూటింగ్‌లతో బిజీగా ఉండే తారలంతా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉండి తమ పాతజ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తండ్రి అశోక్ చోప్రాను గుర్తు చేసుకుంది. ” అప్పుడు నాకు పదహారేళ్లుంటాయి. అమెరికాలో చదువుకోవాలనే కోరికతో అక్కడే చదువుకుంటున్న నేను అప్పుడప్పుడు ఇండియా వచ్చేదాన్ని. ఓ సారి అలా ఇండియా వచ్చినప్పుడు నాన్న నా డ్రెస్ చూసి అరిచారు. ఏంటా డ్రెస్. అంత టైట్‌గానా వేసుకునేది అని నాతో గొడవ పడ్డారు. ఇలాంటి గొడవలు ఎన్ని జరిగినా కాసేపటికే మళ్లీ ఫ్రెండ్స్ అయిపోయే వాళ్లం. నాన్న ప్రతి విషయం అది మంచైనా, చెడైనా తనతో పంచుకోవాలనే వారు. సమస్య ఏదైనా పరిష్కారం ఆలోచిద్దామనే వారు. అంతే కాని తప్పంతా నాదేనని నిందించేవారు కాదు” అని ఓ పత్రికతో ప్రియాంక పంచుకుంది. కాగా, ప్రియాంక తండ్రి 2013లో కాలేయ క్యాన్సర్‌తో కన్నుమూశారు.

Recommended For You