తెలంగాణలో 154కు చేరిన కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 27 కరోనా కేసుల తో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 154 కు చేరింది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 9 మంది మృతి చెందారు. కరోనా పేషంట్ల సంఖ్య పెరుగుతుండటంతో మర్కజ్ యాత్రికులపై ఫోకస్ పెడుతూనే లాక్ డౌన్ ను మరింత పకడ్బందీగా అమలు చేయాలనీ నిర్ణయించింది తెలంగాణ సర్కార్. వైరస్ ను కట్టడి చేసేందుకు ఆయా జిల్లా యంత్రాంగాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా పాజిటివ్ కేసులు తగ్గించడం కష్టసాధ్యంగా మారింది. ఉమ్మది మెదక్ జిల్లాలో కరోనా పాగా వేస్తోంది. సంగారెడ్డిలో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఈ ఆరుగురు ఢిల్లీ మర్కజ్ యాత్రకు వెళ్లినట్టు చెబుతున్నారు. అక్కడినుంచి తిరిగి రాగానే వైద్య పరీక్షలకు పంపగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితుల కుటుంబసభ్యుల్ని కూడా క్వారంటైన్ లో ఉంచారు. మరోవైపు మంత్రి హరీష్ రావు వెంటనే జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరుగురి ఇంటి పరిసరాల్లో కిలోమీటర్ వరకూ 42 మెడికల్ టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఆలాగే ములుగు జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏటూరునాగారం పస్రా కు చెందిన ఒక్కొక్కరికి ఈ మహమ్మారి సోకినట్టు చెప్పారు. అయితే వీరికి మర్కజ్ తో సంబంధం లేదు.

Recommended For You