భారత్ లో కరోనా కట్టడికి ప్రపంచ బ్యాంకు సహాయం

భారత్ లో కరోనా కట్టడికి ప్రపంచ బ్యాంకు సహాయం

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోరాటం చేస్తున్న భారత్ కు.. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది. అభివృద్ధి చెందుతున్న 25 దేశాలకు 1.9 బిలియన్ డాలర్ల అందించనుంది. దీనిలో ఎక్కువ భాగం 1 బిలియన్ డాలర్లు అందిస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది. చైనా తరువాత అధిక జనాభా కలిగిన దేశం కనుక.. ఇప్పుడు కరోనాని అడ్డుకోకపొతే.. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఎక్కువ నిధులు భారత్ కి కేటాయించాయి.

భారత్ తో పాటు ప్రపంచ బ్యాంక్ పాకిస్తాన్‌కు 200 మిలియన్ డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్‌కు 100 మిలియన్ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్ డాలర్లు మరియు శ్రీలంకకు 128.6 మిలియన్ డాలర్లు ఆమోదించింది.

ఇలా కేటాయించిన అత్యవసర నిధులతో స్క్రీనింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్ కిట్లను ఏర్పాటు చేసుకోవాలని.. కొత్త ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తుకోవాలని ప్రపంచ బ్యాంక్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story