నన్ను మహీ ఆ పేరుతో పిలిచి..

నాకు ‘చీకు’ అని పేరు పెట్టింది ఒకరైతే దాన్ని క్రికెట్ అభిమానులకు పరిచయం చేసింది మాత్రం మహీనే అని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమనులతో పంచుకున్నారు. వికెట్ల వెనుక నుంచి మహీ నన్ను తరచూ చీకూ అని పిలుస్తుండేవాడు. దాంతో అది మైక్‌లో రికార్డై అందరికీ తెలిసిపోయింది. అయితే ఈ పేరు పెట్టింది మాత్రం రంజీ కోచ్ అని అన్నారు. రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు నా బుగ్గలు లావుగా ఉండేవి. జుట్టు కూడా స్టయిల్ కత్తిరించుకోవడంతో బుగ్గలు, చెవులు మాత్రమే కనిపించేవి. దాంతో కోచ్ నా బుగ్గలు బూరెల్లా ఉన్నాయని కార్టూన్ క్యారెక్టర్ చీకూ పేరును నాకు పెట్టేశారు. అప్పటినుంచి అదే నా ముద్దు పేరు అయింది. మహీ వల్ల అందరికీ తెలిసింది అని కోహ్లీ తన ముద్దు పేరు వెనుక ఉన్న కథను చెప్పుకొచ్చారు.

Recommended For You