మహానటి మనువాడబోయేది ఎవరినో!!

మహానటి సావిత్రిగా నటించిందా.. కాదేమో జీవించింది అంటేనే తెలుగు ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. థియేటర్లో ఒకసారి చూసినా టీవిలో ఎన్ని సార్లు వచ్చినా అదే మొదటి సారి చూసినట్లు ఆద్యంతం ఆసక్తిగా తిలకిస్తుంటారు. అంతగా తన నటనతో తెలుగు వారిని మెస్మరైజ్ చేసింది కీర్తి. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. అందుకే ఆమెకు ఆ చిత్రం జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది. తాజాగా ఆమె పెళ్లి వార్త సంతోషాన్నిచ్చేదే అయినా మరి పెళ్లయ్యాక నటిస్తుందో లేదో అని ఒకింత నిరాశ కలుగుతుంది అభిమానులకి.

కీర్తి తల్లిదండ్రులు ఆమె కోసం ఓ వరుడిని వెతికినట్లు సమాచారం. అతడు ప్రముఖ బీజేపీ నాయకుడి కుమారుడని తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో వీరి వివాహం ఉండొచ్చని నటుడు ఫూల్‌వాన్ రంగనాథన్ ఓ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే కీర్తి పెళ్లికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడాలి. ప్రస్తుతం కీర్తి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కుకునూర్ నగేశ్ తెరకెక్కిస్తున్నారు. మరో చిత్రం గుడ్ లక్ సఖిలో కీర్తి డీ గ్లామర్ పాత్ర పోషిస్తోంది.

Recommended For You