తెలంగాణలో ఆదివారం వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో శనివారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసాయి. అయితే ఆదివారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. దక్షిణ జార్ఖండ్‌ నుంచి తెలంగాణ వరకు ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువద్ద, దక్షిణ కేరళ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Recommended For You